Sarangapani Jathakam: ఏప్రిల్ 16న ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ 8 d ago

ప్రియదర్శి హీరోగా నటించిన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఏప్రిల్ 25న విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్, పాటలకు మంచి స్పందన లభించింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ను ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయినునట్లు మేకర్స్ ప్రకటించారు.